కారులో వెళుతూ... ఫోన్ లో అందరికీ క్షమాపణలు చెప్పిన 'కాఫీ డే' సిద్ధార్థ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కారులో వెళుతూ... ఫోన్ లో అందరికీ క్షమాపణలు చెప్పిన 'కాఫీ డే' సిద్ధార్థ

  • కారులో ఉన్నంతసేపూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్న సిద్ధార్థ
  • ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు కనిపించలేదన్న భార్య 
  • స్వగ్రామానికి వెళ్తున్నానని భార్యకు చెప్పి ఆత్మహత్య
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికి మంగళూరు వెళుతున్న సమయంలో కారులో ఫోన్‌లో అవతలి వ్యక్తులతో ఆయన మాట్లాడిన మాటలను డ్రైవర్ బసవరాజ్ వెల్లడించాడు. కారులో ఉన్నంత సేపు ఫోన్‌లో ఆయన మాట్లాడుతూ.. పదే పదే క్షమాపణలు చెప్పడాన్ని తాను విన్నానని పేర్కొన్నాడు. దాదాపు పది పదిహేను ఫోన్ కాల్స్ ఆయన చేశారని, అందరికీ ఆయన క్షమాపణలు చెప్పారని తెలిపాడు.

సిద్ధార్థ భార్య మాళవిక మాట్లాడుతూ.. ఉదయం ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పినప్పుడు కూడా ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదని, చాలా కూల్‌గానే ఉన్నారని తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో ఆఫీసు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నానని చెప్పినప్పుడు కూడా తనకు అనుమానం రాలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. స్వతహాగా ఆయన ప్రకృతి ప్రేమికుడు కావడంతో తరచూ స్వగ్రామానికి వెళ్తుంటారని మాళవిక తెలిపారు.
VG Siddhartha
cafe coffee day
Mangalore
malavika

More Telugu News