సావిత్రిగారిని ఆ స్థితిలో చూడలేకపోయాను: నటి రోజా రమణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సావిత్రిగారిని ఆ స్థితిలో చూడలేకపోయాను: నటి రోజా రమణి

  • సావిత్రి గారితో కలిసి నటించాను 
  • ఆమె దర్శకత్వంలో 'చిన్నారి పాపలు' చేశాను
  •  సావిత్రిగారిని చివరి దశలో చూశాను 
తెలుగు తెరపై బాలనటిగా .. కథానాయికగా రోజా రమణి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి రోజా రమణి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సావిత్రి గారిని గురించి ప్రస్తావించారు.

"సావిత్రి గారితో కలిసి బాలనటిగా కొన్ని సినిమాలు చేశాను. ఆమె దర్శకత్వం వహించిన 'చిన్నారి పాపలు' సినిమాలోను నటించాను. ఈ సినిమా షూటింగు సావిత్రిగారి ఇంట్లోనే నెల రోజుల పాటు జరిగింది. దాంతో నేను ఆ కుటుంబానికి బాగా చేరువైపోయాను. ఆ తరువాత చాలా కాలానికి సావిత్రిగారు 'కోమా'లో ఉన్నారనే వార్త విన్నాను. ఒక రోజున నా స్నేహితురాలు చెన్నైలోని ఒక హాస్పిటల్లో డెలివరీ అయితే చూడటానికి వెళ్లాను. అదే హాస్పిటల్లో సావిత్రి గారు వున్నారని తెలిసి లోపలికి వెళ్లాను. అప్పటికే ఆమె రూపం పూర్తిగా మారిపోయి చివరిదశలో వున్నారు. ఆమెను ఆ స్థితిలో చూసి నేను తట్టుకోలేకపోయాను" అని చెప్పుకొచ్చారు.
Roja Ramani
Savithri

More Telugu News