తెలంగాణలో పెరగనున్న మద్యం దుకాణాలు.. అక్టోబరు ఒకటి నుంచి కొత్త విధానం
- సెప్టెంబరుతో ముగియనున్న పాత విధానం
- కొత్త మండలాల్లో కొత్తగా వైన్ షాపులు
- మండలానికి కనీసం ఒకటి ఉండేలా ఏర్పాటు
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలతోపాటు 125 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో దాదాపు సగం మండలాల్లో మద్యం దుకాణాలు లేవు. దీంతో అక్కడున్న డిమాండ్‌ను బట్టి ఆయా మండలాల్లో కొత్త మద్యం షాపుల ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంతోపాటు ప్రస్తుతం దుకాణాలు ఉన్న మండలాల్లో డిమాండ్‌ను బట్టి మరిన్ని షాపుల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆబ్కారీ అధికారులు యోచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2216 వైన్ దుకాణాలు, 670 బార్లు ఉన్నాయి.