నా యువరాణికి జన్మదిన శుభాకాంక్షలు: రామ్ చరణ్

  • ఉపాసన బర్త్ డేకి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టిన రామ్ చరణ్
  • పార్కులో ఉయ్యాల ఊగుతున్న ఉపాసన
  • దేవుడు సుఖసంతోషాలతో దీవించాలంటూ కామెంట్
టాలీవుడ్ లో మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసనల స్థానం ప్రత్యేకం. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవించే ఈ జంటకు సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులున్నారు. ముఖ్యంగా, ఉపాసనకు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో లక్షల్లో అభిమానులున్నారు. ఎందరు ఫ్యాన్స్ ఉన్నా ఆమెకు నంబర్ వన్ అభిమాని ఎప్పటికీ రామ్ చరణే. తన తాజా పోస్టుతో ఆ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.

తన అర్ధాంగి ఉపాసన బర్త్ డేని పురస్కరించుకుని ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటో పోస్టు చేశాడు. ఓ పార్కులో చిన్నపిల్లలా ఉయ్యాల ఊగుతున్న ఉపాసనను ఆ ఫొటోలో చూడొచ్చు. నా యువరాణికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు సుఖసంతోషాలతో దీవించాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్ చేశాడు. ఈ పోస్టుకు కొద్ది వ్యవధిలోనే భారీ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు లైకులు, షేర్లతో సందడి చేస్తున్నారు.
Go Back to Shorts
Ramcharan
Upasana
Birth Day
Tollywood

More Telugu News