ఊరిలో చిచ్చుపెట్టిన ‘గ్రామ వాలంటీర్’ పోస్టు.. బట్టలు ఉతకరాదని తీర్మానించిన రజకులు!
- శ్రీకాకుళం జిల్లాలోని బీటీ వాడలో ఘటన
- తమ కులస్తుడికి పోస్టు ఇవ్వకపోవడంపై ఆగ్రహం
- ఊర్లో బట్టలు ఉతకబోమని దండోరా వేయించిన రజకులు
తమ కులస్తుడికి కాకుండా మరొకరికి గ్రామ వాలంటీర్ పోస్టును ఇచ్చినందున రేపటి నుంచి గ్రామస్తుల దుస్తులు ఉతకబోమని ప్రకటించారు. ఈ మేరకు బీటీ వాడ గ్రామంలో దండోరా వేయించారు. కాగా, ఈ వ్యవహారంపై అటు గ్రామపెద్దలు, ఇటు ప్రభుత్వ అధికారులు స్పందించలేదు.