వీసా రెడ్డి గారూ.. ముందు ట్రీట్మెంట్ తీసుకోండి.. లెక్కలపై తీరిగ్గా ఆలోచించుకోవచ్చు!: బుద్ధా వెంకన్న

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. రూ.43,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీబీఐ తమ కేసుల్లో పేర్కొంటే వాటిని విజయసాయిరెడ్డి తప్పుడు లెక్క అంటున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టుపై అన్ని అనుమానాలను కేంద్రం తీర్చాక కూడా ఆ లెక్క తప్పనీ, పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయసాయిరెడ్డికి  ఏమీ తెలియదనీ, చెప్పినా అర్థం చేసుకోరని దుయ్యబట్టారు. ముందుగా విజయసాయిరెడ్డి ట్రీట్మెంట్ తీసుకోవాలనీ, ఆ తర్వాత లెక్కల గురించి  తీరిగ్గా ఆలోచించుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Telugudesam
budda venkanna
BUdha venkanna

More Telugu News