జగన్ గారూ.. ఈ దోపిడీకి ప్లాన్ వేయడం సిగ్గుగా అనిపించడం లేదా?: నారా లోకేశ్
- ఏపీ ప్రభుత్వం ఆశా వర్కర్లను మోసం చేసింది
- సీఎం జగన్ గారూ.. వీరంతా ఎక్కడికి వెళ్లాలి?
- వైసీపీ కార్యకర్తలు ఆశావర్కర్లు అయితే తప్ప జీతాలు పెంచరా?
సీఎం జగన్ గారూ.. మీరు తరిమేస్తే ఆశా కార్యకర్తలంతా ఎక్కడకు వెళ్లాలి? అని లోకేశ్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్నవాళ్లు వెళ్లిపోయి వైసీపీ కార్యకర్తలు ఆశావర్కర్లు అయితే తప్ప జీతాలు పెంచరా? అని నిలదీశారు. ‘ఈ చిరుద్యోగుల విషయంలో కూడా మీ పార్టీ వాళ్లు దోపిడీకి ప్లాన్ చేయడం సిగ్గుగా అనిపించడం లేదా? మానవత్వం, మంచితనం పెంచుకోరా?’ అని దుయ్యబట్టారు. ఈ మేరకు లోకేశ్ ఈరోజు వరుస ట్వీట్లు చేశారు.