పెద్ద దర్శకులు అవకాశాలు ఇవ్వడం లేదు .. కొత్తవాళ్లు గౌరవించడం లేదు: హాస్యనటి గీతా సింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెద్ద దర్శకులు అవకాశాలు ఇవ్వడం లేదు .. కొత్తవాళ్లు గౌరవించడం లేదు: హాస్యనటి గీతా సింగ్

  • అవకాశాలు తగ్గుతున్నాయి 
  • అడిగినా వేషాలు ఇవ్వడం లేదు
  • సీనియర్స్ ను పట్టించుకోవడం లేదు
హాస్యనటిగా గీతా సింగ్ చాలా పాత్రల్లో కనిపించి ఆడియన్స్ కి కితకితలు పెట్టేశారు. అలాంటి గీతా సింగ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకి అవకాశాలు తగ్గుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. "ఒకప్పటితో పోలిస్తే ఇటీవల అవకాశాలు బాగా తగ్గిపోయాయి. రెండు మూడు రోజుల పాటు చేసే పాత్రలు కూడా రావడం లేదు.

తెలిసిన దర్శక నిర్మాతలను అడిగితే, తప్పకుండా పిలుస్తామంటారుగానీ పిలవరు. ఇక కొత్తగా చాలామంది దర్శకులు వస్తున్నారు. వాళ్లలో కొంతమంది మాలాంటి ఆర్టిస్టులకు కనీస మర్యాద ఇవ్వడం లేదు. ఇటీవల ఒక కొత్త దర్శకుడి సినిమా కోసం వెళితే నాకు కూడా ఆడిషన్ చేస్తామన్నారు. అప్పటికే అక్కడ ఒక సీనియర్ నటి చాలా సేపటి నుంచి కూర్చుని వున్నారు. ఆమెను పట్టించుకున్నవాళ్లు లేరు. నాకే చాలా బాధగా అనిపించి ఆమెను తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాను" అని చెప్పుకొచ్చారు. 
geeta singh

More Telugu News