నేడు, రేపు పలు ప్రాంతాల్లో స్వల్ప వర్షాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు, రేపు పలు ప్రాంతాల్లో స్వల్ప వర్షాలు!

  • గత వారంలో చురుకుగా కదిలిన నైరుతి
  • ప్రస్తుతం సాధారణ స్థాయిలోనే
  • ఆదివారం నాడు 166 ప్రాంతాల్లో వర్షపాతం
గత వారంలో చురుకుగా కదిలిన నైరుతి రుతుపవనాల కదలికలు, ప్రస్తుతం సాధారణ స్థాయిలో కొనసాగుతూ ఉండటంతో, వర్షాలు తగ్గిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారి రాజారావు వెల్లడించారు. నిన్న ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ తెలంగాణలోని 166 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇదిలావుండగా, వర్షాలు తగ్గడంతో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల వరకూ అధికంగా నమోదయ్యాయి. దీంతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఉక్కపోతను అనుభవించారు.
Rains
Telangana
Hyderabad
Andhra Pradesh

More Telugu News