కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్... నేను రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందన్న కుమారస్వామి
- సస్పెన్స్ సినిమాను తలపిస్తున్న కర్ణాటక రాజకీయం
- కుమారస్వామి రాజీనామా చేస్తారంటూ ఉదయం నుంచి వార్తలు
- అంత అవసరం ఏమొచ్చిందని మీడియాను ప్రశ్నించిన స్వామి
2009-10లో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అతన్ని వ్యతిరేకిస్తూ ఎనిమిది మంది మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని... కానీ అప్పుడు ఏం జరిగింది? అని ప్రశ్నిస్తూ మీడియా నుంచి కుమారస్వామి దూరంగా వెళ్లిపోయారు. మరోవైపు ఈ సాయంత్రం 6 గంటల లోపు స్పీకర్ ముందు హాజరుకావాలంటూ రెబెల్ ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజీనామా చేయాలనుకున్న వారు నేరుగా స్పీకర్ కు రాజీనామా పత్రాలను అందజేయాలని సూచించింది.