19 నుంచి నీలం సంజీవరెడ్డి జయంత్యుత్సవాలు
ఈనెల 19న మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి రఘువీరారెడ్డి సచివాలయంలో ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 19 నుంచి నవంబరు 1 వరకు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. మే 19 నుంచి అన్ని జిల్లా కలెక్టరేట్లలో నీలం సంజీవరెడ్డికి నివాళులర్పించడంతో పాటు సభలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నవంబరు 1న అనంతపురం జిల్లాలో ముగింపు వేడుకలను నిర్వహిస్తామని, ఈ వేడుకలకు రాష్ట్రపతిని ఆహ్వానిస్తామని రఘువీరా తెలిపారు.