ఫిఫ్టీ పూర్తిచేసి కామెంటరీ బాక్స్ దిశగా బ్యాట్ ఊపిన జడేజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫిఫ్టీ పూర్తిచేసి కామెంటరీ బాక్స్ దిశగా బ్యాట్ ఊపిన జడేజా

  • మంజ్రేకర్ ను ఉద్దేశించేనా?
  • కొన్నిరోజుల క్రితం జడేజాపై మంజ్రేకర్ విమర్శలు
  • కివీస్ తో సెమీస్ లో పోరాడుతున్న టీమిండియా
టీమిండియా లక్ష్యఛేదన ఆరంభంలో ఏకపక్షంగా కనిపించిన సెమీస్ సమరం ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. జడేజా దూకుడు, ధోనీ సంయమనంతో భారత్ మళ్లీ రేసులోకొచ్చింది. అయితే, ఫిఫ్టీ సాధించిన వెంటనే రవీంద్ర జడేజా తన ట్రేడ్ మార్కు కత్తిసాము చేస్తూ కామెంటరీ బాక్స్ దిశగా సంజ్ఞలు చేయడం కనిపించింది.

కొన్నిరోజుల క్రితం మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ 'అడపాదడపా ఆటగాడు' అంటూ జడేజా విషయంలో కామెంట్ చేశాడు. దీనిపై మంజ్రేకర్ కు భారీస్థాయిలో ట్రోలింగ్ ఎదురైంది. జడేజా కూడా "నీ నోటి విరేచనాలు ఇక కట్టిపెట్టు" అంటూ మంజ్రేకర్ ను ఉద్దేశించి ఘాటుగా బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో, జడేజా బ్యాట్ ఊపింది మంజ్రేకర్ ను ఉద్దేశించేనని అర్థమవుతోంది. 50 పరుగులు చేసిన వెంటనే "ఇప్పుడేమంటావు?" అనే రీతిలో జడేజా బాడీ లాంగ్వేజ్ కనిపించింది.
India
New Zealand

More Telugu News