ఫొటో తీయబోయిన అమ్మాయిని తొండంతో చాచిపెట్టి కొట్టిన ఏనుగు

  • జాంబియాలో ఘటన
  • జూలో పెన్సిల్వేనియా విద్యార్థుల సందర్శన
  • ఏనుగు చేతిలో విద్యార్థినికి చేదు అనుభవం
ఆఫ్రికా దేశం జాంబియాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. తనను ఫొటో తీస్తున్న అమ్మాయిపై ఏనుగు ఆగ్రహించింది. తొండంతో బలంగా కొట్టింది. పెన్సిల్వేనియాకు చెందిన ఓ విద్యార్థి బృందం జాంబియాలో పర్యటిస్తూ ఓ జూకి వెళ్లింది. విద్యార్థులందరూ అక్కడున్న ఓ ఏనుగుతో కరచాలనం చేస్తూ ఆస్వాదిస్తున్నారు. వారిలో ఓ అమ్మాయి తన సెల్ ఫోన్ తో ఆ ఏనుగును ఫొటో తీసేందుకు ప్రయత్నించింది. దాంతో ఆ ఏనుగు కోపంతో ఒక్కటిచ్చుకుంది. ఎవరూ ఊహించని విధంగా తొండంతో చాచిపెట్టి కొట్టింది. ఆ ఊపుకు  ఫొటో తీస్తున్న అమ్మాయి వెనక్కిపడిపోయింది. సెల్ ఫోన్ కిందపడిపోగా, దాన్నందుకునేందుకు ఏనుగు ప్రయత్నించడం అక్కడివాళ్లను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది.

Go Back to Shorts
Zambia
Africa
Elephant
Photo

More Telugu News