సినిమాలకి గుడ్ బై చెప్పనున్న నిహారిక?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమాలకి గుడ్ బై చెప్పనున్న నిహారిక?

  • నిరాశ పరిచిన సినిమాలు 
  • మంచిపేరు తెచ్చిన వెబ్ సిరీస్ లు 
  • వెబ్ సిరీస్ లపైనే పూర్తి దృష్టి
మెగా డాటర్ గా నిహారిక నటన వైపుకు వచ్చేసి చాలా కాలమే అయింది. ఒక వైపున సొంత బ్యానర్లో వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ .. నటిస్తూ, మరో వైపున సినిమాలపై దృష్టి పెట్టింది. తనకి నచ్చిన కథలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, 'ఒక మనసు' .. 'హ్యాపీ వెడ్డింగ్' .. 'సూర్యకాంతం' వంటి సినిమాలు చేసింది.

అయితే ఈ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఇక సినిమాలకి గుడ్ బై చెప్పేయాలనే నిర్ణయానికి నిహారిక వచ్చేసిందనీ, ఈ విషయాన్ని తండ్రితోను చెప్పేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇకపై సినిమాల జోలికి వెళ్లకుండా వెబ్ సిరీస్ ల పైనే పూర్తి దృష్టిపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. వెబ్ సిరీస్ ల వల్లనే తనకి మంచి పేరు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
Niharika

More Telugu News