నేనెప్పటికీ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు సోదరుడ్నే: కిషన్ రెడ్డి
- మంద కృష్ణ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు
- ఎమ్మార్పీఎస్ ను బలహీనపర్చేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి
- ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని కాలరాసేందుకు ప్రయత్నించారు
ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ సాగిస్తున్న అలుపెరుగని పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఆయనకు అండగా నిలుస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ ను బలహీనపర్చేందుకు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని కాలరాసేందుకు పాలకులు ఎన్నో కుతంత్రాలకు పాల్పడినా మంద కృష్ణ మాత్రం పోరాటపంథాను వీడలేదని అన్నారు. కాగా, ఈదుమూడిలో నిర్వహించిన మాదిగల ఆత్మగౌరవ సభలో కిషన్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.