వరుణ్ తేజ్ 'వాల్మీకి' టైటిల్ వివాదంపై హరీశ్ శంకర్ స్పందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరుణ్ తేజ్ 'వాల్మీకి' టైటిల్ వివాదంపై హరీశ్ శంకర్ స్పందన

  • అభ్యంతరం వ్యక్తం చేసిన అనంతపురం వాల్మీకి సంఘం
  • పోలీసులకు ఫిర్యాదు
  • హీరో పేరు వాల్మీకి కాదని బదులిచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్
యంగ్ హీరో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రానికి వాల్మీకి అనే టైటిల్ పెట్టడాన్ని అనంతపురం వాల్మీకి సంఘం తప్పుబట్టింది. ఓ కమర్షియల్ చిత్రానికి వాల్మీకి అనే పేరుపెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తామని అనంతపురానికి చెందిన వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి నేత లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రౌడీయిజం ఇతివృత్తంగా ఉన్న ఈ సినిమాకు వాల్మీకి వంటి పేరు పెట్టడం సబబు కాదని, టైటిల్ మార్చకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై దర్శకుడు హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా బదులిచ్చారు. తమ చిత్రంలో హీరో పేరు మాత్రం వాల్మీకి కాదని, అంతగొప్ప మహనీయుడి పేరుకు భంగం కలిగేలా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. ఏదేమైనా వాల్మీకి సంఘం అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అయినా, వాల్మీకిని ఆరాధించిన రాముడు కూడా ధర్మం కోసం పోరాటాలు చేశాడని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.
Valmiki
Varun Tej
Harish Shankar
Tollywood

More Telugu News