రాజన్న రాజ్యంలో జరుగుతున్న రాక్షసపర్వం ఇదే!: ఆడియో విడుదల చేసిన నారా లోకేశ్
- టీడీపీ నేతపై వైసీపీ నేత చిందులు
- జుగుప్సాకరమైన భాషను వాడారన్న లోకేశ్
- పార్టీ మారనందుకు వేధిస్తున్నారని ఆగ్రహం
‘సీఎం జగన్ గారూ..! పార్టీ మారను అన్న పాపానికి ఒక టీడీపీ నాయకుడిని ఎలా హింసిస్తున్నారో చూడండి. టీడీపీ నేత భార్యను ప్రస్తావిస్తూ మీ వైసీపీ నేతలు వాడిన భాష ఎంత జుగుప్సాకరంగా ఉందో విని సిగ్గుపడండి. ఇదీ మీ రాజన్న రాజ్యంలో జరుగుతున్న రాక్షస పర్వం’ అని ట్వీట్ చేశారు. ఈ సంభాషణను హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినాలని లోకేశ్ సూచించారు.