రాజీనామాను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ!
- సీడబ్ల్యూసీకి ఇప్పటికే రాజీనామా సమర్పణ
- రాహుల్ రాజీనామాను తిరస్కరించిన సీడబ్ల్యూసీ
- అయినా వెనక్కి తగ్గని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ
‘అద్భుతమైన భారత దేశానికి జవసత్వాలు అందించిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నాపై అపరిమితమైన ప్రేమ చూపిన దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. జైహింద్’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తన రాజీనామా లేఖను రాహుల్ జతచేశారు.


