కేసు నమోదు చేయాలంటే వైసీపీ ఎమ్మెల్యేలతో ఫోన్ చేయించమంటున్నారు: టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు

  • వైసీపీ దాడులపై టీడీపీ నేతల స్పందన
  • ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు
  • శాంతిభద్రతలు చూడాల్సిన బాధ్యత హోం మంత్రిదే
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తోందంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసు నమోదు చేయాలంటే వైసీపీ ఎమ్మెల్యేలతో ఫోన్ చేయించమంటున్నారని ధ్వజమెత్తారు.

వర్ల రామయ్య మాట్లాడుతూ, హోం మంత్రి సుచరిత ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. అన్ని చోట్లా కాపలా పెట్టలేమని ఆమె వ్యాఖ్యానించడం బాధాకరమని, శాంతిభద్రతలు చూడాల్సిన బాధ్యత హోం మంత్రిదేనని గుర్తుచేశారు.

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ, శాంతి భద్రతలు కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైఎస్ హయాంలో కూడా ఇలాంటి పాలన లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Telugudesam
YSRCP
MLA
Ramanaidu
DGP
Sawang

More Telugu News