దొంగలకే షాకిచ్చిన మహిళ.. వీడియోను పోస్ట్ చేసిన రాచకొండ పోలీసులు!
- పర్సు లాక్కోవడానికి వచ్చిన దొంగలు
- వెనకే ఉన్న ఇంట్లోకి విసిరేసిన మహిళ
- భయంతో పారిపోయిన దొంగలు
అయితే సదరు దొంగను కొద్దిదూరంలోనే గమనించిన మహిళ.. తెలివిగా తన పర్సును వెనకాలే ఉన్న ఓ ఇంట్లోకి విసిరేసింది. అనంతరం దొంగకు చిక్కకుండా పారిపోయింది. దీంతో తాము దొరికిపోతామన్న భయంతో బైక్ పై ఇద్దరు దొంగలు ఉడాయించారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రాచకొండ పోలీసులు ‘కొంచెం సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మీ పర్సును ఇలా కాపాడుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు.