వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి బూతుపురాణం.. ఆడియో రిలీజ్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాక్షస రాజ్యం నడుస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్టును బెదిరిస్తున్నారని లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతి ఏంటో ఊహించుకోవాలని పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ను లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ ఆడియోను కుటుంబ సభ్యులతో కలిసి వినొద్దనీ, ఇందులో అసభ్య పదజాలం ఉందని సూచించారు. ఈ మేరకు లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Telugudesam
kotam reddy sridhar reddy
journalist
warning
abuse

More Telugu News