ఇదే నిజమైతే ఈ దఫా వరల్డ్ కప్ పాకిస్థాన్ దే... గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్!
- 1992లో ఇమ్రాన్ నేతృత్వంలో గెలిచిన పాక్
- నాడు ఏం జరిగిందో నేడు కూడా అదేలా
- కప్ తమదేనని చెబుతున్న పాక్ అభిమానులు
1992లో తొలి మ్యాచ్ లో ఓడిన పాక్, రెండో మ్యాచ్ గెలువగా, మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆపై నాలుగు, ఐదవ మ్యాచ్ లను ఓడిపోయిన పాక్, సెమీస్ పై ఆశలను వదిలేసుకుంది. ఆపై ఆరు, ఏడవ మ్యాచ్ లలో పాకిస్థాన్ గెలిచిన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని జట్టు, అదే ఊపుతో కప్పును ఎగరేసుకు పోయింది. ఇక ప్రస్తుత మ్యాచ్ లలోనూ పాక్ పయనం సరిగ్గా 17 ఏళ్ల నాడు ఎలా జరిగిందో అలాగే జరగడం గమనార్హం. యాదృచ్చికమే అయినా, ఇప్పుడు కూడా పాక్ జట్టే విజయం సాధించి, సగర్వంగా స్వదేశానికి వస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.