భారీ రేటుకు 'సాహో' విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ రేటుకు 'సాహో' విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు

  • సుజిత్ నుంచి రానున్న 'సాహో'
  • ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్ 
  • ఆగస్టు 15వ తేదీన విడుదల
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఫర్స్ ఫిల్మ్స్ వారు ఈ సినిమా విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్నారు.

ఒక్క మిడిల్ ఈస్ట్ లో మినహా, యశ్ రాజ్ ఫిలిమ్స్ వారితో కలిసి ఫర్స్ ఫిల్మ్స్ వారు విదేశాల్లో మన సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నారు. అలా ఫర్స్ ఫిల్మ్స్ వారు ఎన్నో విజయాలను .. లాభాలను సాధించారు. ఈ సంస్థ 'సాహో' విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకోవడంతో, 'సాహో' మరింత భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వెళ్లనుందనే విషయం స్పష్టమవుతోంది.
Prabhas
shraddha kapoor

More Telugu News