వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోన్న 'కబీర్ సింగ్'
- 'అర్జున్ రెడ్డి' రీమేక్ గా 'కబీర్ సింగ్'
- దేశవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు 20 కోట్లు
- 3 రోజుల్లో 70 కోట్ల వసూళ్లు
విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. దేశవ్యాప్తంగా తొలి రోజున ఈ సినిమా 20 కోట్లను .. రెండవ రోజున 22 కోట్లను .. మూడో రోజున 28 కోట్లను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా తొలి 3 రోజుల్లో 70 కోట్లను రాబట్టినట్టుగా ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. తెలుగులో మాదిరిగానే హిందీలోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.