మీ వాళ్లు మా పార్టీలో చేరితే మా మీద విషం కక్కడం ఎందుకు?: టీడీపీపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్
- బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు
- విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు
- టీడీపీ విమర్శలకు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్
ఈరోజు ట్విట్టర్ లో విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ..‘బీజేపీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించదు. మీ(టీడీపీ) సభ్యులు మా పార్టీలో చేరితే మా మీద విషం కక్కడం ఎందుకో అర్థం కావడం లేదు. తప్పు అంతా రాహుల్ గాంధీలో, తెలుగుదేశం పార్టీ దగ్గర పెట్టుకుని మీడియా ముందు ఏడవడం ఎందుకు?’ అని విమర్శించారు.