హైదరాబాద్ లో కొలువైన మరో శిల్పారామం

  • ఉప్పల్ వద్ద మూసీ నదీతీరంలో మినీ శిల్పారామం ఏర్పాటు
  • నేడు ప్రారంభోత్సవం
  • ట్వీట్ చేసిన కేటీఆర్
హైదరాబాద్ లో ఇప్పటికే ఓ శిల్పారామం ఉండగా, నగర తూర్పుప్రాంతానికి కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఉప్పల్ లో మినీ శిల్పారామం నిర్మించారు. ఏడాది క్రితం దీనికి శంకుస్థాపన జరగ్గా, ఈ సాయంత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఉప్పల్ వద్ద మూసీ నదీ తీరంలో ఏర్పాటైన ఈ తాజా శిల్పారామం ప్రారంభోత్సవంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ నగర తూర్పు ప్రాంతంలో కూడా ఓ శిల్పారామం ఏర్పాటవడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. ఇక మీదట పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటు జీవన నాణ్యత ప్రమాణాలు కూడా ఉన్నతీకరణ చెందుతాయని కేటీఆర్ వివరించారు.
Go Back to Shorts
Hyderabad
Shilparamam
KTR
Telangana

More Telugu News