‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్.. సమ్మర్ బ్లాక్‌బస్టర్ కావాలి: దుల్కర్ సల్మాన్
- తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం
- అమెరికా వెళ్లాలనుకునే యువకుడి కథతో డార్క్ హ్యూమర్ ఎంటర్టయినర్
- మే 1న గ్రాండ్ రిలీజ్
- నేడు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా విచ్చేసిన దుల్కర్ సల్మాన్
నటుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ ‘గాయపడ్డ సింహం’. ఇందులో జేడీ చక్రవర్తి కీలకపాత్ర పోషించారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం అట్టహాసంగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా పెద్ద విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ట్రైలర్ ఆద్యంతం వినోదం, వ్యంగ్యం, భావోద్వేగాల మేళవింపుతో ఆకట్టుకుంది. అమెరికాలో స్థిరపడాలని కలలు కన్న ఓ యువకుడు, డొనాల్డ్ ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ పాలసీల వల్ల తిరిగి ఇండియాకు రావాల్సి వస్తుంది. తన కలలు చెదిరిపోవడంతో నిరాశకు గురైన అతను, తనదైన శైలిలో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే అంశాన్ని దర్శకుడు డార్క్ హ్యూమర్‌తో చూపించారు. తరుణ్ భాస్కర్ తన సహజ నటనతో ఆకట్టుకోగా, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడీ చక్రవర్తి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో, శ్రీ విష్ణు ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషం.
ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, “‘గాయపడ్డ సింహం’ టైటిల్ విన్నప్పటి నుంచే ఆసక్తి కలిగింది. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ప్రతి విజువల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అమెరికా వెళ్లాలని చాలా మంది కలలు కంటారు, కాబట్టి ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా తప్పకుండా బిగ్ సమ్మర్ బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను” అని అన్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “నాలుగు రోజుల క్రితం సినిమా చూశాను. చాలా మంచి కాన్సెప్ట్. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. సెకండ్ హాఫ్‌లోని ఐదు ఎపిసోడ్స్ థియేటర్‌లో బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. అవి వర్కవుట్ అయితే ఇది మరో జాతిరత్నాలు అవుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి పవన్ సాదినేని సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్‌లపై కల్యాణ చక్రవర్తి, భాను కిరణ్, విజయ్ కృష్ణ, ఉమేష్ బన్సల్ నిర్మించారు. స్వీకర్ అగస్తి సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో జేడీ చక్రవర్తి, ఫరియా అబ్దుల్లా, దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్, నిర్మాతలు, ఇతర చిత్ర బృందం పాల్గొని సినిమా విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు.