ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు ఆపేస్తాం.. గిరిజనుల మనోభావాలను దెబ్బతీయబోం!: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
- ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకుంటాం
- అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం అమలు
- విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి
టీడీపీ అధినేత చంద్రబాబు తరహాలో ఆచరణ సాధ్యం కాని హామీలను సీఎం జగన్ ఇవ్వరని పుష్పశ్రీవాణి చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ‘రైతు భరోసా’ పథకం అమలు చేస్తామని ప్రకటించారు.‘పేద ప్రజలకు ఇళ్లను కేటాయిస్తాం. కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్నతేడా చూపకుండా అందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందజేస్తాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు మంత్రి శ్రీవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.