Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామారావుగారికే నన్ను చూడాలనే ఆసక్తి కలిగింది: నటుడు కైకాల సత్యనారాయణ

  • డీఎల్ గారు నన్ను పరిచయం చేశారు
  • ఎన్టీఆర్ లా ఉన్నావని అంతా అన్నారు
  •  తానే వెళ్లి ఎన్టీఆర్ ను కలిశానన్న కైకాల
తెలుగు తెరపై ప్రతినాయకుడిగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా వందలాది పాత్రలను చేసిన అనుభవం కైకాల సత్యనారాయణ సొంతం. తెలుగు తెరపై ఎస్వీరంగారావు తరువాత పౌరాణిక పాత్రలకి ఆ స్థాయిలో సెట్ అయ్యే నటుడు ఆయన. అలాంటి కైకాల సత్యనారాయణ ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు.

"నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో అంతా కూడా నన్ను చూసి ఎన్టీఆర్ పోలికలు ఉన్నాయని అనేవారు. ఈ విషయం ఎన్టీఆర్ వరకూ వెళ్లింది. దాంతో ఆయనకి నన్ను చూడాలనిపించింది. డీఎల్ గారు నన్ను ఎన్టీఆర్ దగ్గరికి పంపించారు. ఎన్టీఆర్ గారు నన్ను ఆత్మీయంగా పలకరించారు. నా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన సినిమాల్లో నన్ను డూప్ గా పెట్టుకోమని సిఫార్స్ చేశారు. ఆ తరువాత నటుడిగా నన్ను ప్రోత్సహించారు" అని చెప్పుకొచ్చారు.
kaikala

More Telugu News