జూలై 10 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు!
- 25 రోజుల పాటు సాగనున్న ఏపీ అసెంబ్లీ
- జూలై 12న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- పలు అంశాలపై సాగనున్న వాడీవేడీ చర్చ
గత ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఏపీ అభివృద్ధి, కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, పలు కీలక ప్రాజెక్టుల్లో పురోగతి సహా పలు అంశాలపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ సాగనుంది.