అనంతపురంలో టీడీపీ నేత చంద్రశేఖర్ కు చెందిన తోట నరికివేత!
- చిన్నమల్లేపల్లిలో చీనీతోట సాగుచేస్తున్న చంద్రశేఖర్
- చెట్లను నరికివేసిన గుర్తుతెలియని దుండగులు
- ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి
ఈ విషయమై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు పదేళ్ల కిందట ఇలాంటి సంస్కృతి ఉండేదని తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతులను వదిలేయాలని సూచించారు. తమ కార్యకర్తలకు చెందిన తోటలు, ఆస్తులను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ కిరణ్ కుమార్ రెడ్డితో ఫోన్ మాట్లాడిన జేసీ.. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. కాగా, లక్షలు పోసి కన్నబిడ్డల్లా సాగుచేసిన చెట్లను నరికివేశారని టీడీపీ నేత చంద్రశేఖర్ నాయుడు కన్నీరుమున్నీరుగా విలపించారు.