విమానంలో కుదుపులు.. కిందపడిన ప్రయాణికులు.. భయంతో కేకలు

  • ప్రిస్టినా నుంచి బెసెల్ వెళ్తున్న విమానం
  • ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు ఘటన
  • భయంతో ప్రయాణికుల హాహాకారాలు
రోడ్డుపై వెళ్తున్న వాహనానికి స్పీడ్ బ్రేకర్ అడ్డం వస్తే ఎలా కుదుపులకు గురవుతుందో అచ్చం అలానే జరిగిందో విమానానికి.  కొసోవోలోని ప్రిస్టినా నుంచి స్విట్జర్లాండ్‌లోని బెసెల్‌కు వెళ్తున్న విమానం 30 సెకన్ల పాటు గాల్లో కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు సీట్ల నుంచి ఎగిరి కిందపడ్డారు. సర్వ్ చేసేందుకు డ్రింక్స్ తీసుకెళ్తున్న ఎయిర్‌హోస్టెస్‌లు కూడా కిందపడడంతో వారి చేతుల్లో ఉన్న డ్రింక్స్ ప్రయాణికులపై ఎగిరిపడ్డాయి.

డ్రింక్స్ కార్ట్ ఎగిరి విమానం సీలింగుకి తగలడంతో అందులో ఉన్న వేడి పానీయాలు ప్రయాణికులపై చెల్లాచెదురుగా పడి చురుక్కుమనిపించాయి. విమానానికి ఏమైందో? ఏం జరగుతోందో? తెలియక ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. హాహాకారాలు చేశారు. ఈ ఘటనలో కిందపడిన పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. విమానం బెసెల్‌లో క్షేమంగా ల్యాండయ్యాక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. విమానం ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు ఈ ఘటన జరిగిందని, కారణం తెలియరాలేదని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
flight
switzerland
Kosovo
pristina

More Telugu News