Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జయం' షూటింగులో తేజగారు నన్ను కొట్టేశారు: కమెడియన్ సుమన్ శెట్టి

  • నా తొలి సినిమా 'జయం'
  • తేజ గారికి ఫొటోలు పంపించాను
  • 'అలీబాబా' పాత్రకి ఎంపిక చేశారు
తెలుగు తెరకి 'జయం' సినిమా ద్వారా కమెడియన్ గా పరిచయమైన సుమన్ శెట్టి, ఆ తరువాత కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 'జయం' సినిమాను గురించి ప్రస్తావించాడు.

'జయం' సినిమా కోసం కొత్త ఆర్టిస్టులు కావలెను అనే ప్రకటన ఒక సినిమా పత్రికలో వచ్చింది. అది చూసి .. ఆ అడ్రెస్ కి నా ఫొటోలు పంపించాను. ఆడిషన్ కి రమ్మంటే వెళ్లాను .. 'అలీబాబా' పాత్రకి నన్ను ఎంపిక చేశారు. అలా 'జయం' సినిమాతో కమెడియన్ ను అయ్యాను. అయితే ఈ సినిమాలో ర్యాగింగ్ సీన్లో షకీలాను నేను చూసే షాట్ .. తేజగారు అనుకున్నట్టుగా రాలేదు. దాంతో ఆయన నన్ను కొట్టారు .. ఆ తరువాత షాట్ ఓకే అయింది" అని చెప్పుకొచ్చాడు.
suman shetty
ali

More Telugu News