మమతకు మరో తలనొప్పి.. మొదలైన టీచర్ల సమ్మె!
- వైద్యులు సమ్మె విరమించిన కాసేపటికే మరో ఆందోళన
- టీచర్లను అదుపు చేసేందుకు పోలీసుల లాఠీ చార్జ్
- వేతనాలు పెంచాలంటూ ఈ నెల 12 నుంచి టీచర్ల ఆందోళన
శిశు శిక్ష కేంద్ర (ఎస్ఎస్‌కే), మాధ్యమిక శిక్షణ కేంద్ర టీచర్లు-పోలీసుల మధ్య ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. ఉపాధ్యాయులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. వికాశ్ భవన్‌లోని బెంగాల్ విద్యాశాఖ మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12 నుంచి ఉపాధ్యాయులు ధర్నాలు చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా వేతనాలు పెరగలేదని, విద్యార్హతల ఆధారంగా వేతనాలు పెంచాలన్నది వారి డిమాండ్.