Andhra Pradesh: 2024లో 25కు 25 లోక్ సభ సీట్లను కొల్లగొడతాం!: విజయసాయిరెడ్డి ధీమా

  • వైసీపీ తరఫున 22 మంది గెలిచారు
  • ఇది సీఎం జగన్ ఘనవిజయానికి నిదర్శనం
  • ఏపీలో జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు
లోక్ సభకు 22 మంది వైసీపీ సభ్యులు ఎన్నిక కావడం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఘనవిజయానికి నిదర్శమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 25కు 25 లోక్ సభ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఏపీ ప్రజలకు సీఎం జగన్ అవినీతిరహిత పాలన అందిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజారంజక పాలన అందించేలా జగన్ నిర్ణయాలు ఉండబోతున్నాయని అన్నారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా పార్లమెంటులో వైసీపీ సభ్యులు పనిచేస్తారని పేర్కొన్నారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Jagan
loksabha
25 seats

More Telugu News