కొరటాల దర్శకత్వంలో మరోసారి ఎన్టీఆర్?
Add ap7am to your home Screen

కొరటాల దర్శకత్వంలో మరోసారి ఎన్టీఆర్?

  • చిరూ సినిమా పనులతో కొరటాల బిజీ
  • 'ఆర్ ఆర్ ఆర్' షూటింగులో ఎన్టీఆర్
  •  వచ్చే ఏడాదిలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
ఎన్టీఆర్ .. కొరటాల శివ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'జనతా గ్యారేజ్' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. అలాంటి ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపొందే అవకాశాలు పుష్కలంగా వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. చిరంజీవితో సెట్స్ పైకి వెళ్లే పనులతో కొరటాల వున్నాడు. ఎవరికి వారు ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయిన తరువాత, ఇద్దరూ కలిసి మళ్లీ ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. కొరటాలకి .. ఎన్టీఆర్ కి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన కొరటాలకి ఎన్టీఆర్ మాట ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖాయమేనని చెప్పుకుంటున్నారు. 
koratala
ntr

More Telugu News