Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యువకుడి లైంగిక వేధింపులు, బెదిరింపులు భరించలేక దంపతుల ఆత్మహత్యా యత్నం

  • భర్త మృతి...చావుబతుకుల మధ్య భార్య
  • వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒత్తిడి
  • కేసు ఉపసంహరించుకోకుంటే చంపుతామంటూ బెదిరింపులు
ఓ యువకుని వికృత చేష్టలు దంపతుల్లో ఒకరి నిండు జీవితాన్ని బలితీసుకోగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. లైంగిక వేధింపులు, బెదిరింపులు పరాకాష్టకు చేరగా ఒత్తిడి భరించలేని దంపతులు తనువు చాలించాలనుకున్నారు. కర్ణాటక రాష్ట్రం  చిత్రదుర్గం జిల్లా హోసదుర్గం తాలూకా కొండాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్యను అదే గ్రామానికి చెందిన వినయ్‌ అనే యువకుడు కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమెతో జరిపిన సంభాషణలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీన్ని గుర్తించిన ఆమె భర్త వినయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వినయ్‌ కుటుంబ సభ్యులు బాధిత దంపతులపై ఒత్తిడి మొదలు పెట్టారు. కేసు ఉపసంహరించుకోకుంటే చంపుతామంటూ బెదిరించడం మొదలుపెట్టారు.

దీంతో ఫోన్‌లో వినయ్‌ కుటుంబం బెదిరింపులను రికార్డు చేసిన దంపతులు వాటిని వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టి అనంతరం తోణచేనహళ్లి శివారులోని వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. వాట్సాప్‌ మెసేజ్‌ గుర్తించిన శ్రీరాంపురం పోలీసులు వీరు ఉరేసుకున్న ఘటనా స్థలికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భర్త మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న భార్యను ఆసుపత్రికి తరలించారు.  
couple suicide attempt
husbend died
chitradurgam

More Telugu News