ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది: 'సాహో' దర్శకుడు సుజిత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది: 'సాహో' దర్శకుడు సుజిత్

  • ఇది నా వయసుకి మించిన బాధ్యత
  •  నాపై నిర్మాతలు నమ్మకం ఉంచారు
  •  ప్రభాస్ చాలా కూల్ హీరో
ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు సుజిత్ 'సాహో' సినిమాను రూపొందిస్తున్నాడు. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలో పాటల చిత్రీకరణను పూర్తిచేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి సుజిత్ ప్రస్తావించాడు.

"నిజానికి ఇది నా అనుభవానికి మించిన బాధ్యత. నన్ను నమ్మి ఇంతటి బాధ్యతను నిర్మాతలు నాకు అప్పగించారు. ప్రభాస్ గొప్ప స్టార్ అయినప్పటికీ ఆయన కూడా నన్ను నమ్ముతూ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన చాలా కూల్ హీరో .. ఏ రోజునా నన్ను టెన్షన్ పెట్టలేదు. కానీ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నాలో టెన్షన్ పెరుగుతోంది. ఇది అందరి దర్శకులకి వుండే టెన్షనే. ఆగస్టు 15న రానున్న ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు. 
prabhas
shraddha kapoor

More Telugu News