ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

  • ఫస్టియర్ లో 53,025 మంది ఉత్తీర్ణత
  • సెకండియర్ లో 66,114 మంది పాస్
  • ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
ఏపీ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ సాయంత్రం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల్లో 53,025 మంది ఉత్తీర్ణులయ్యారు.  ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో 66,114 మంది ఉత్తీర్ణులయ్యారు.

మార్చిలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 4,76,710 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 2,86,932 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు సప్లిమెంటరీ ఫలితాల నేపథ్యంలో మొత్తం 3, 39,957 మంది ఇంటర్ ఫస్టియర్ పాసయ్యారు. ఇక సెకండియర్ విషయానికొస్తే, మార్చిలో 4,31,739 మంది పరీక్షలు రాయగా, 3,09,721 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడు సప్లిమెంటరీ ఫలితాలతో కలుపుకుని ఇంటర్ సెకండియర్ లో ఉత్తీర్ణులైన వారి సంఖ్య 3,75,835కి చేరింది.
Andhra Pradesh
Inter
Adimulapu Suresh
Results

More Telugu News