అదిరిపోయింది... ప్రభాస్ 'సాహో' టీజర్ పై రాజమౌళి స్పందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదిరిపోయింది... ప్రభాస్ 'సాహో' టీజర్ పై రాజమౌళి స్పందన

  • యూవీ క్రియేషన్స్ పెట్టిన బడ్జెట్ కు సుజీత్ న్యాయం చేశాడు
  • ప్రభాస్ మనోహరంగా ఉన్నాడు
  • సోషల్ మీడియాలో రాజమౌళి వ్యాఖ్యలు
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన హైయాక్షన్ మూవీ 'సాహో' టీజర్ ఇవాళ రిలీజైంది. దీనిపై సెలబ్రిటీలు భారీస్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా, టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా 'సాహో' టీజర్ పై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సాహో చిత్రానికి ఎంత బడ్జెట్ అవసరమో అంత డబ్బును యూవీ క్రియేషన్స్ ఖర్చుపెట్టగా, ఆ బడ్జెట్ కు దర్శకుడు సుజీత్ న్యాయం చేశాడని రాజమౌళి వ్యాఖ్యానించారు. 'సాహో' టీజర్ చూస్తే అదిరిపోయిందని, ప్రభాస్ శక్తి ఏంటో ఇందులో తెలుస్తుందని, ఎంతో ధీరోదాత్తంగా, మరెంతో  మనోహరంగా కనిపించాడని, తన డార్లింగ్ బిరుదుకు కూడా న్యాయం చేశాడని రాజమౌళి వివరించారు.
Rajamouli
Prabhas
Saaho

More Telugu News