'సాహో'పై టాలీవుడ్ సెలబ్రిటీల స్పందన ఇది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో'పై టాలీవుడ్ సెలబ్రిటీల స్పందన ఇది!

  • ఈ ఉదయం విడుదలైన 'సాహో' టీజర్
  • హాలీవుడ్ ను తలపించే యాక్షన్ సీన్స్
  • కితాబిచ్చిన పలువురు
'బాహుబలి' తరువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా నటిస్తున్న యాక్ష‌న్ చిత్రం 'సాహో' టీజ‌ర్ ఈ ఉదయం విడుదల కాగా, టాలీవుడ్ సెలబ్రిటీలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. టీజర్ లోని ప్ర‌భాస్ చేస్తున్న ఫైట్స్, యాక్ష‌న్ సీన్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. హాలీవుడ్ రేంజ్‌ కి తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఈ టీజర్ చెబుతోంది.

ఇక దీన్ని చూసిన టాలీవుడ్ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుధీర్ బాబు, సురేంద‌ర్ రెడ్డి, నితిన్, సాయి ధ‌ర‌మ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్, మారుతి, సుధీర్ వ‌ర్మ‌, త‌దిత‌రులు పొగడ్తల వర్షం కురిపించారు. టీజరే ఇలా నిప్పులు చెరుగుతుంటే, సినిమా ఇక బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఫిల్మేనని కితాబిచ్చారు. మొత్తం టీజర్ లో హీరోయిన్ శ్రద్ధ "ఇంత వయొలెంట్ గా ఉన్నారు. ఎవ‌రు?" అనగా ప్రభాస్ చెప్పే "డై హార్డ్‌ ఫ్యాన్స్‌" అనడం హైలైట్ గా నిలిచింది.
Sahoo
Prabhas
Teaser

More Telugu News