Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అన్నయ్యా' అని పిలుస్తూ శ్రీకాంత్ ను ఇబ్బంది పెట్టేశాను: 'ఖడ్గం' సంగీత

  • కోలీవుడ్లో విజయ్ ఆత్మీయుడు
  •  శ్రీకాంత్ చాలా మంచి మనిషి
  • అదొక ఫన్నీ ఇన్సిడెంట్ 
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సంగీత మాట్లాడుతూ, ఒక సరదా సంఘటనను గురించి ప్రస్తావించారు. "కోలీవుడ్లో నాకు సంబంధించిన విషయాల్లో హీరో విజయ్ చాలా కేర్ తీసుకునేవారు. ఇక టాలీవుడ్లో హీరో శ్రీకాంత్ నాతో చాలా ఆత్మీయంగా ఉండేవారు. ఆయనతో షూటింగు అంటే ఆయనతో పాటు నాకు కూడా వాళ్ల ఇంటి నుంచి భోజనం వచ్చేది.

ఒకసారి ఒక సినిమాకి సంబంధించిన రొమాంటిక్ సీన్ ను ఎలా చేయాలనేది నాకు శ్రీకాంత్ చెబుతున్నాడు. ఆయన ఏం చెబుతున్నా నేను 'అలాగే అన్నయ్య .. ఓకే అన్నయ్య .. ఇలాగైతే బాగుంటుందేమో అన్నయ్యా' అని అంటున్నాను. దాంతో శ్రీకాంత్ 'అబ్బబ్బా ఎన్నిసార్లు అన్నయ్యా అంటావ్ .. చేయబోయేది రొమాంటిక్ సీన్ .. నువ్వు అన్నయ్య అంటుంటే నాకు ఎలాగో వుంది .. సంగీతకి మీరే చెప్పండి సార్' అని డైరెక్టర్ గారితో అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు" అంటూ సంగీత నవ్వేశారు.
sangeeta
srikanth

More Telugu News