బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ ఇదేనట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ ఇదేనట

  • బాలకృష్ణ కొత్త సినిమాకి సన్నాహాలు
  • పక్కకి పెట్టేసిన 'రూలర్' టైటిల్
  •  'క్రాంతి' టైటిల్ వైపు బాలయ్య మొగ్గు
బాలకృష్ణ తదుపరి సినిమాకి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ టైటిల్ విషయంలో బాలకృష్ణ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారట.

అందువలన 'క్రాంతి' అనే టైటిల్ వైపు బాలకృష్ణ మొగ్గుచూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ టైటిల్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఆయన పాత్ర .. 'టెంపర్' లో ఎన్టీఆర్ పాత్ర తరహాలో ఉంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి
balakrishna

More Telugu News