భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన.. తను చదివిన పాఠశాల మట్టిని తెప్పించుకుని వాసన చూసి బరిలోకి దిగిన కోహ్లీ!

ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో నేడు భారత్ - ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ పరుగుల వరద పారిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. మ్యాచ్‌కు ముందు కోహ్లీ తను చదువుకున్న పాఠశాల మైదానంలోని మట్టిని వాసన చూసి మరీ బరిలోకి దిగాడు. ఈ విధంగా మాతృభూమిపై మమకారాన్ని చాటుకోవడం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

కోహ్లీ ఢిల్లీలోని విశాల్ భారతి స్కూల్లో తొమ్మిదో గ్రేడ్ వరకూ చదివాడు. ఆ సమయంలోనే 1998లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేరాడు. అదే తన ఎదుగుదలకు బీజం వేసింది. అనంతరం తన టాలెంట్‌‌తో 2008లో ఇండియన్ క్రికెట్‌లో చేరి, ప్రస్తుతం టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కోహ్లీ మ్యాచ్‌కు ముందు తన పాఠశాల మట్టిని తెప్పించుకుని వాసన చూశాడు.
Go Back to Shorts
Virat Kohli
England
India
Australia
Match
Vishal Bharathi
Delhi

More Telugu News