కొడుకుతో కలిసి కూల్ కూల్ గా... టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్ లో మహేశ్ బాబు సందడి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొడుకుతో కలిసి కూల్ కూల్ గా... టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్ లో మహేశ్ బాబు సందడి!

  • గౌతమ్ కోసం మ్యాచ్ కు వచ్చానన్న మహేశ్
  • సెల్ఫీ తీసి పోస్టు చేసిన వైనం
  • వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్
టీమిండియా ఇవాళ ఆస్ట్రేలియా జట్టుతో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతుండగా, అరుదైన అతిథి మ్యాచ్ కు విచ్చేశాడు. ఆ అతిథి మహేశ్ బాబు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ అంటే ఇష్టమే అయినా మహేశ్ స్టేడియంకు వచ్చి మ్యాచ్ లు చూడడం ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. అయితే, కొడుకు గౌతమ్ కోసం ఈ టాలీవుడ్ అగ్రహీరో మైదానానికి రాక తప్పలేదు. ప్రస్తుతం ఫారెన్ టూర్లో ఉన్న మహేశ్ బాబు ఫ్యామిలీ కొన్నిరోజుల ముందే లండన్ లో జరిగే టీమిండియా మ్యాచ్ కోసం టికెట్లు బుక్ చేసుకుంది.

ఈ క్రమంలో, ఆదివారం జరుగుతున్న మ్యాచ్ లో మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ తో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ కలిసి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మ్యాచ్ ను హాయిగా ఆస్వాదిస్తూ ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. మా అబ్బాయి కోసం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కు వచ్చానంటూ మహేశ్ తన సెల్ఫీకి క్యాప్షన్ పెట్టాడు. దీన్ని మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేయగా, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కాగా, స్టేడియంలో మహేశ్ బాబు ఫ్యామిలీతో మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా జతకలిశాడు. ఈ సందర్భంగా మరో సెల్ఫీ పుట్టుకొచ్చింది.
Mahesh Babu
Team India
Worldcup
London
Oval

More Telugu News