తనలోని స్పేస్ పరిజ్ఞానాన్ని చూపిన ట్రంప్... నెటిజన్ల ఎద్దేవా!

09-06-2019 Sun 06:36 | International
  • అంగారకుడిలో చంద్రుడు భాగమట
  • మరింత పెద్ద లక్ష్యాలను సాధించాలి
  • జోకులు, వెటకారాలతో ఆడుకుంటున్న నెటిజన్లు
తరచూ ఏదో ఒకటి మాట్లాడి, నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరోసారి అదే పని  చేశారు. చంద్రుడు కూడా అంగారకుడిలో భాగమేనంటూ ఆయన చేసిన ఓ ట్వీట్ పై ఇప్పు ట్రోలింగ్ మొదలైంది. తాజాగా, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ టార్గెట్ గా ఆయన ట్వీట్ చేశారు. "అంతరిక్ష పరిశోధనలకు కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాం. ఆ డబ్బునంతా చంద్రుడిపై మాత్రమే పరిశోధనలకు నాసా ఎందుకు ఖర్చు చేస్తోంది?. 50 ఏళ్ల క్రితమే మనం చంద్రుడిపై కాలు పెట్టాం. రక్షణ, సైన్స్‌ రంగాల్లో ఇంకా పెద్ద లక్ష్యాలను సాధించాలి. అంగారకుడిపై అధ్యయనం చేయాలి (చంద్రుడు కూడా అంగారకుడిలో భాగమే కదా)" అని ట్రంప్ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్ వైరల్ కాగా, జోకులు, వెటకారాలు, వెక్కిరింపులు, మెమెలతో నెటిజన్లు ఆడుకుంటున్నారు. చంద్రుడు భూమికి ఉపగ్రహమని గుర్తు చేస్తున్నారు. ఈ విషయం ఐదో తరగతి చదువుతున్న వారికి కూడా తెలుసునని, 3.39 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న అంగారకుడు చంద్రుడిలో భాగం ఏంటని, అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం జ్ఞానం ఉండద్దా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇక మరికొందరైతే, ట్రంప్ తండ్రి ఖగోళ శాస్త్రం గురించి ఎన్నడూ చెప్పలేదని, అంగారకుడిలో చంద్రుడిని భాగం చేసి కొత్త రహస్యాన్ని ట్రంప్‌ బట్టబయలు చేశారని అంటున్నారు. ఇకపై నాసా ట్రంప్‌ సహాయ సహకారాలు ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందని చలోక్తులు విసురుతున్నారు.
Donald TrumpSpaceTwitter

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more