Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవిప్రకాశ్ చెప్పినవి ఎంతవరకు వాస్తవం అనేది తేలాల్సి ఉంది: బంజారాహిల్స్ ఏసీపీ

  • రవిప్రకాశ్ విచారణ పూర్తి
  • మీడియాకు వివరాలు వెల్లడించిన ఏసీపీ
  • రవిప్రకాశ్ చెప్పింది తప్పయితే విచారణకు సహకరించనట్టేనన్న పోలీసు అధికారి
ఫోర్జరీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను విచారించినట్టు బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని ప్రశ్నలను రవిప్రకాశ్ ను అడిగామని, ఆయన ఇచ్చిన సమాధానాలను రికార్డు చేశామని శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే, రవిప్రకాశ్ చెప్పినవాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తేలాల్సి ఉందని అన్నారు.

కాగా, పోలీసుల విచారణలో ప్రధానంగా రవిప్రకాశ్ కు, నటుడు శివాజీకి మధ్య ఉన్న లావాదేవీలు, ఒప్పందాలు, రవిప్రకాశ్ టీవీ9 లోగోను విక్రయించడం వంటి అంశాలపై దృష్టి సారించారు. గతంలో లభించిన ఆధారాలతో, ప్రస్తుతం రవిప్రకాశ్ చెప్పిన విషయాలను పోల్చుకుంటున్నారు. రవిప్రకాశ్ చెప్పిన సమాధానాలు తప్పయితే మాత్రం ఆయన తమ విచారణకు సహకరించలేదనే భావిస్తామని ఏసీపీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

TV9
Raviprakash

More Telugu News