మోదీకి మరో లేఖ రాసిన ఇమ్రాన్ ఖాన్

  • కశ్మీర్ అంశంతో పాటు అన్ని సమస్యలపై చర్చకు సిద్ధం
  • ప్రాంతీయ అభివృద్ధి కోసం కలసి పని చేద్దాం
  • సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గం
కశ్మీర్ అంశంతో పాటు, పలు సమస్యలు, వివాదాలపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రధాని మోదీకి పాకిస్థాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారు. త్వరలో జరగనున్న ఎస్సీవో శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా పాక్ ప్రధానితో ఎలాంటి చర్చలు ఉండబోవంటూ భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో, మోదీకి ఇమ్రాన్ లేఖ రాయడం గమనార్హం. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి ఇమ్రాన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాంతీయ అభివృద్ధి కోసం ఇరు దేశాలు కలసికట్టుగా పని చేయాలని లేఖలో ఇమ్రాన్ ఆకాంక్షించారు. ఇరు దేశాల్లో పేదరికం ఉందని... దీన్ని అధిగమించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలే ఏకైక మార్గమని తెలిపారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
modi
imran khan
letter

More Telugu News