భానుడి భగభగలకు చెక్.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
- నెలరోజుల్లోగా దేశమంతా విస్తరణ
- దాదాపు 96 శాతం వర్షపాతం కురుస్తుందన్న ఐఎండీ
- దేశ వర్షపాతంలో 70 శాతం నైరుతీ రుతుపవనాల వల్లే
నైరుతి రుతుపవనాలతో ఈసారి సాధారణ వర్షపాతమే నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నైరుతి రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటులో 96 శాతం వర్షపాతం నమోదు అవుతుందని వెల్లడించింది. భారత్ లో నమోదయ్యే వర్షపాతంలో 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తాయి.