రుణ ఎగవేత దారులు విదేశాలకు పారిపోకముందే పట్టుకోవాలి!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- భారత్ గొప్ప వృద్ధిని నమోదు చేస్తోంది
- చట్టసభల్లో సభ్యులే అడ్డంకులు సృష్టిస్తున్నారు
- ట్విట్టర్ లో స్పందించిన ఉపరాష్ట్రపతి
ఈ మేరకు వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో స్పందించారు. ఇక చట్ట సభల్లోనూ సభ్యులు అర్థవంతమైన చర్చలు జరపడానికి బదులుగా సభా కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రుణఎగవేత దారులు, మోసాలకు పాల్పడిన కంపెనీల యజమానులు విదేశాలకు పారిపోకముందే వారిని చట్టం ముందుకు తీసుకొచ్చి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరముందని వెంకయ్య అభిప్రాయపడ్డారు.